telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బనకచర్ల ప్రాజెక్టు కోసం ప్రత్యేక సంస్థ: విజయవాడలో ‘జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్’ ఏర్పాటు

ఏపీ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. విజయవాడ  కేంద్రంగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పోలవరం – బనకచర్ల  నిర్మాణం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.

ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకూ ప్రత్యేక కార్పొరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

విజయవాడలో జలవనరుల శాఖ కార్యాలయంలో ‘జలహారతి’ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటైంది.

బనకచర్లతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేలా ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించింది.

తెలుగు రాష్ట్రాల్లో వివాదంగా మారిని బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

బనకచర్ల ప్రాజెక్టును స్థాపించేందుకు పునాది వేస్తూ.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.

సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

అమరావతిని కేంద్రంగా పనిచేయనున్న ఈ కంపెనీ 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు సర్కార్ పేర్కొంది.

ఈ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మన్‌గా, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వైస్ ఛైర్మన్‌గా, ముఖ్య కార్యదర్శి సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు .

Related posts