ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే నైరుతి రుతుపవనాలు సోమవారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించడంతో వేసవి కాలం ముగింపును సూచిస్తుంది.
సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణను తాకుతాయి నైరుతి రుతుపవనాలు. కానీ.. ఈ ఏడాది వారం రోజుల ముందుగానే వచ్చేశాయి.
ఈ నేపథ్యంలో రైతులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముందుగానే పంటలు వేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు.
తెలంగాణ, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా నైరుతి రుతుపవనాలు రాష్ట్రాలలో మరింతగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న 4-5 రోజుల్లో రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలను తాకవచ్చు. జూన్ 7న భారీ వర్షాలు, జూన్ 3 నుంచి 10 వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.


ఏపీ సీడ్స్ విత్తనాలు తెలంగాణలో పంపిణీ: మాజీ మంత్రి ఆలపాటి