వలస కార్మికుల దృష్టిలో దేవుడిగా వెలుగొందుతున్న రియల్ హీరో సోనూసూద్ తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మహారాష్ట్ర పోలీసులకు 25 వేల ఫేస్ షీల్డ్‌లను ఆయన దానం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. సోనూకు థ్యాంక్స్ చెప్పారు. ‘పోలీసుల కోసం 25వేల ఫేస్ షీల్డ్‌లను ఇచ్చిన సోనూసూద్‌కు ధన్యవాదాలు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక దీనికి స్పందించిన సోనూసూద్.. ‘మీ వ్యాఖ్యలు నన్ను కదిలించాయి. పోలీస్ సోదరీ సోదరీమణులే మన రియల్ హీరోలు. వారు చేస్తున్న సేవలకు నేను చేసే సాయం చాలా చిన్నది’ అని కామెంట్ పెట్టారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకు సాయం చేసే విషయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఓ పుస్తకంగా రాస్తానని ఇటీవల సోనూసూద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Truly honoured by your kind words Sir! My police brothers & sisters are our real heroes & this is the least that I can do for the commendable work which they have been doing. Jai Hind 🇮🇳🇮🇳 #OurRealHeroes @DGPMaharashtra https://t.co/n9nTrxaQ0c
— sonu sood (@SonuSood) July 16, 2020


