జూన్ 02, 2024న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ని ఆహ్వానించారు సీఎం రేవంత్.
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించిన సోనియా గాంధీ.. వేడుకలకు హాజరవుతానని మాటిచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది.
అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడంలేదని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.