ఇప్పటికే మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ తాజాగా మరో మలయాళ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన మలయాళ చిత్రం ‘కప్పెల’ ఘనవిజయం సాధించింది. ఈ చిన్న సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఒక సోషల్ మెసేజ్‌తో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కప్పెల’. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్‌టైన్మెంట్ కొనుగోలు చేసినట్టు మలయాళ నిర్మాత విష్ణు వేణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘సంతోషకరమైన వార్తను ప్రకటిస్తున్నాను! కప్పెల సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ వారు తెలుగులో తిరిగి నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, ‘జెర్సీ’, ఇంకా ఎన్నో చిత్రాలను వీరు నిర్మించారు. ‘ప్రేమమ్’, ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తరవాత మలయాళ ఇండస్ట్రీ నుంచి సితార ఎంటర్‌టైన్మెంట్స్ కొనుగోలు చేసిన మూడో చిత్రం ‘కప్పెల’. మా చిన్న సినిమాకు పెద్ద విజయం అందించిన మా శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని విష్ణు వేణు తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. టాలీవుడ్‌లో రీమేక్ సినిమాల జోరు పెరుగుతోంది. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు పరభాషా చిత్రాల రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ సినిమాలు మన నిర్మాతలను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘లూసిఫర్’ రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కొనుగోలు చేసింది.
previous post
next post


సల్మాన్ “పేపర్ టైగర్”… సింగర్ సంచలన వ్యాఖ్యలు