telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్యకు జోడిగా అమలాపాల్ ?

AMala

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణ 106వ చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘మోనార్క్’, ‘సూపర్ మ్యాన్’ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో బాలకృష్ణ తప్ప ఇతర పాత్రధారులు ఎవరనే విషయంపై అధికారిక ప్రకటనలేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చిత్ర వర్గాల సమాచారం. ఈ ఇద్దరిలో ఒక కొత్త హీరోయిన్‌కు చోటుందట. ఇక మరో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేశారనే విషయంలో ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయి. హీరోయిన్ అంజలి పేరును కూడా బోయపాటి శ్రీను పరిశీలించారని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నటి అమలాపాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటించనున్నారని అంటున్నారు. ఇది సినిమాకు చాలా కీలకమైన పాత్ర కావడంతో అమలాపాల్‌ను బోయపాటి సంప్రదించారట. ఆమెకు కథ నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపేసారని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందట. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Related posts