ప్రముఖ సింగర్, రాపర్ నోయల్ తన భార్య నటి ఎస్తేర్ తో విడాకులు తీసుకున్నట్టు స్వయంగా ప్రకరించి షాక్ ఇచ్చాడు. తాజాగా నోయల్ తమ విడాకుల గురించి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ”చాలా రోజుల నిశ్శబ్దం తరువాత అధికారికంగా ఎస్తేర్‌తో నాకు విడాకులు అయిన విషయాన్నిప్రకటిస్తున్నా…. ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పేందుకు కోర్టు తీర్పు కోసం వేచి ఉన్నాం. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో విడాకులు తీసుకున్నాము. ఎస్తేర్ నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా. ఎస్తేర్‌ను గానీ, నా కుటుంబాన్నిగానీ ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి అని అభ్యర్థిస్తున్నా. బాధలో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న నా కుటుంబం, స్నేహితులు అందరికీ థ్యాంక్స్. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. కొత్త జీవితానికి ప్రారంభించడానికి ఇది మంచి సమయమని భావిస్తున్నా” అంటూ నోయల్ పేర్కొన్నాడు. కొన్ని రోజులు ప్రేమలో ఉన్న తరవాత పెళ్లి చేసుకున్న ఈ జంట అతి తక్కువ కాలంలోనే విడాకులు తీసుకోవడం గమనార్హం.
previous post
next post


సౌత్‌లో హీరోలను చూడటానికే థియేటర్స్‌కు వస్తారు : రకుల్ ప్రీత్ సింగ్