telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ప్రియుడితో కలిసి భర్తను చంపి దొరక్కుండా భార్య షాకింగ్ స్కెచ్!

ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అతనితో కలిసి భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మృతిచెందాడని నమ్మించి అంత్యక్రియలు చేయించింది.

హత్య చేసిన ప్రధాన నిందితుల్లో ఒకరు పోలీసుల వద్ద లొంగిపోవడంతో ఈ పన్నాగం బయటపడింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్‌నగర్‌లోని ఓ అపార్టుమెంటులో విజయ్‌కుమార్‌, శ్రీలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.

శ్రీలక్ష్మి తన ప్రియుడు రాజేశ్‌ తో పెళ్లి అనంతరం వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న భర్త విజయ్ కుమార్ (40) అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

దీనికి రాజేశ్ తనకు పరిచయమున్న సనత్​నగర్​కు చెందిన పటోళ్ల, రాజేశ్వర్​రెడ్డితో కుట్ర పన్నాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన విజయ్​కుమార్ తన పిల్లల్ని పాఠశాలలో దింపేందుకు వెళ్లగా.. రాజేశ్‌, పటోళ్ల రాజేశ్వర్‌రెడ్డి, మైతాబ్‌ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్​రూంలో దాచింది.

పిల్లల్ని స్కూల్లో దింపి రాజేశ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపలి నుంచి గడి పెట్టగా.. రాజేశ్, రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ బాత్​రూమ్​లో నుంచి బయటకు వచ్చి కసరత్తులకు ఉపయోగిచే డంబెళ్లు, ఇనుపరాడ్లతో విచక్షణా రహితంగా విజయ్​పై దాడి చేశారు.

శ్రీలక్ష్మీ ఇంట్లోని రక్తపు మరకలను తుడిచేసి, శవంపై దుస్తులను మార్చేసి ఇక తన భర్త గుండెపోటుతో మరణించాడని నమ్మించి విజయ్ అంత్యక్రియలు జరిపించింది.

విజయ్​ను కొడుతుండగా తనను చంపొద్దని వేడుకోవడం తనకు పదేపదే గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో కుంగిపోయిన రాజేశ్వర్ రెడ్డి గురువారం మధురానగర్ కు వచ్చి జరిగిన విషయం పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాజేశ్వర్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజేశ్‌, మైతాబ్‌పై కేసు నమోదు చేశారు.

Related posts