ప్రముఖ బాలీవుడ్ సినిమా నటి , పొడుగు కాళ్ళ సుందరి శిల్పాశెట్టి ఎట్టకేలకు మౌనం వీడింది. తన భర్త… ప్రముఖ వ్యాపారవేత్త రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్ కో- ఓనర్ రాజ్ కుంద్రా…. పోర్నోగ్రఫీ చిత్రీకరణ ఆరోపణలపై అరెస్టు చేశారు. ఇక కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలోని శిల్పాశెట్టి పై తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఇన్ని రోజులూ మౌనంగా ఉన్న శిల్పా ఈ రోజు ఎట్టకేలకు మౌనం వీడింది. మొదటిసారి తన సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను వీడుదల చేసింది.
తన భర్త రాజ్ కుంద్రా కేసులో తమ కుటుంబం పట్ల ట్రోల్ చేస్తూ.. పూర్తి సమాచారం తెలుసుకోకుండా పుకార్లు ప్రచారం చేస్తూ.. ఒకరకంగా ఇబ్బంది పెడుతున్నారని, దయ చేసి వీటికి ఆపి వేయండి అంటూ నటి శిల్పా శెట్టి కోరింది.తమకు మీడియా ‘ట్రయల్ ‘అవసరం లేదని, తమపై వస్తున్న ఆరోపణలకు తాను స్పందించబోనని ఆమె తాజా స్టేట్ మెంట్ లో స్పష్టం చేసింది.
అనుచితమైన వదంతులు, అభియోగాలు తగవు. గత కొన్ని రోజులుగా ప్రతీ విషయం లోనూ మేము సవాళ్ళను ఎదుర్కొంటున్నాం.. నన్ను, నా కుటుంబాన్ని వేలెత్తి చూపుతున్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు.. కేసు కోర్టు పరిశీలనలో ఉంది. అందువల్ల నేను ఎలాంటి కామెంట్లు చేయను అని ఆమె వివరించింది. ఇకపై కూడా ఎలాంటి స్పందన ఉండదని, తమపట్ల తప్పుడు వ్యాఖ్యలు చేయరాదని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘నెవర్ కంప్లెయిన్, నెవర్ ఎక్స్ ప్లైన్’ అన్న పద్దతిని తాను పాటిస్తానని ఆమె తెలిపింది.
ముంబై పోలీసుల పట్ల, భారత జుడీషియరీ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని శిల్పా శెట్టి వెల్లడించింది. ఒక కుటుంబంగా తాము అందుబాటులో ఉన్న అన్ని లీగల్ మార్గాలను పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొంది. ముఖ్యంగా తల్లిగా నా పిల్లల కోసం మా గోప్యతను గౌరవించమని, నిజం ఏంటో తెలుసుకోకుండా తెలిసీ తెలియని సమాచారంతో వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోరింది.
నేను గర్వించదగిన భారతీయ పౌరురాలిని. గత 29 సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తున్న నటిని. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. నా మీద అభిమానులకు విశ్వాసం ఉంది.. ఎవరినీ కించపరచాలన్నది మా ఉద్దేశం కాదు. దయచేసి చట్టాన్ని పని చేసుకోనివ్వండి అంటూ పోస్ట్ చేసింది.


