telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనాకు మద్దతుగా బాలీవుడ్ దిగ్గజ నటుడు

Kangana

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్‌ గత నెల 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో ఆయనను హత్య చేశారని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ కంగన రనౌత్ సైతం సుశాంత్ ఆత్మహత్య కు బాలీవుడ్ లో ఉన్న నెపోటిజమే అని అన్నారు. అంతేకాకుండా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, అందుకోసం ఎంత దూరమైన వెళ్తానని కంగనా స్పష్టం చేశారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే ఈ ఫైర్ బ్రాండ్.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్యా లేదా పక్కా పథకం ప్రకారం చేసిన హత్యా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ లోని కొందరు పెద్దలు ముఠాగా ఏర్పడి ప్రతిభావంతులైన బయటివారిని ఎలా తొక్కేస్తున్నారో కంగన మాట్లాడుతోంది. కంగనాకు దిగ్గజ నటుడు శత్రుఘ్న సిన్హా మద్ధతునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. కంగనా ఎదుగుదలను, ధైర్యాన్ని చూసి ఓర్వలేని వాళ్లే ఆమెను విమర్శిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.”‘కంగానకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్లలో చాలా మంది ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేకే అలా మాట్లాడుతున్నారు. మా దయ, మా చొరవ లేకుండా, మా గ్రూపుల్లో చేరకుండా, మా ఆశీర్వాదం లేకుండా.. ఈ అమ్మాయి తన స్వయంకృషితో చాలా ఎత్తుకు ఎదిగింది. మా అండ లేకుండానే ఆమె ఎంతో సాధించింది. అందుకే ఆమె విజయాన్ని, ధైర్యాన్ని చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారు..” అని వ్యాఖ్యానించారు. సుశాంత్ మరణానికి నెపోటిజం కూడా ఒక కారణమని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు బహిరంగంగా వ్యాఖ్యానించారు.

Related posts