telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో … నాలుగో స్థానంలో ఏపీ …

andhrapradesh 4th in solar power production

ఏపీ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో నాలుగో స్థానంలో నిలిచింది. 2016-17 నుంచి 2019-20 సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా సోలార్‌ విద్యుదుత్పత్తిపై లెక్కలు తీయగా.. కర్ణాటక 14,471.91 మిలియన్‌ యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌ 13,625.58 మిలియన్‌ యూనిట్లు, తెలంగాణ 13,422.68 మిలియన్‌ యూనిట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ఏపీ 12,742.94 మిలియన్‌ యూనిట్లతో నాలుగో స్థానం, తమిళనాడు 10,693.51 మిలియన్‌ యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచాయి. సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలను సమీక్ష చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించాకా రాష్ట్రంలో ఉత్పత్తి సగానికి పడిపోయింది. గురువారం లోక్‌సభలో ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ ప్రకటించారు.

Related posts