telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మగబిడ్డ పుడితే మన సమాజం గొప్పగా భావిస్తుంది… కానీ… : అనుష్క

Anushka-Sharma

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం‌లోని హాథ్రాస్‌లో జరిగిన అత్యాచార ఘటన దేశంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి దుర్ఘటనలపై స్పందిస్తూ సీరియస్ అయింది హీరోయిన్ అనుష్క శర్మ. ”పిల్లాడు పుడితేనే అదృష్టం అని భావిస్తున్న తల్లిదండ్రులు చాలా విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. సమాజంలోని అమ్మాయిలను, సమాజాన్ని గౌరవించే విధంగా అబ్బాయిలను పెంచాలి. అప్పుడే తాము గొప్ప అని తల్లిదండ్రులమని భావించాలి. సమాజం బాగుకోసం ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. అబ్బాయి పుట్టగానే గొప్పకాదు.. ఆ అబ్బాయిని సమాజం గౌరవించినప్పుడే తల్లిదండ్రుల గొప్ప” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అనుష్క శర్మ. హాథ్రాస్‌ ఘటన చూస్తుంటే ఆడపిల్లల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించే రాక్షసులు కూడా ఉన్నారా? మగబిడ్డ పుడితే మన సమాజం గొప్పగా భావిస్తుంది కానీ నిజానికి అమ్మాయి పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదని పేర్కొంది. కాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లాడిన అనుష్క శర్మ.. ప్రస్తుతం ఓ బిడ్డను తన కడుపులో మోస్తోంది. ఆమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇటీవలే విరాట్ అఫీషియల్‌గా ప్రకటించారు.

Related posts