telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కేసీఆర్‌పై సోష‌ల్ మీడియా వేదిక వైఎస్ ష‌ర్మిల‌ ఫైర్…

కేసీఆర్‌పై సోష‌ల్ మీడియా వేదిక వైఎస్ ష‌ర్మిల‌ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కరోనా కేసుకు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యం కోసం ప్ర‌భుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల‌ను భ‌ర్తీ చేయ‌డం కోసం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంపై ట్విట్ట‌ర్‌లో స్పందించిన ఆమె.. కాంట్రాక్టు కాదు దొర‌.. ప‌ర్మినెంట్ రిక్రూట్‌మెంట్ చేయ్ అంటూ తెలంగాణ యాస‌లో కేసీఆర్‌పై సెటైర్లు వేశారు.. 755 అంటూ కొస‌ర‌కు కేసీఆర్ దొర‌… హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న 23,512 ఖాళీ పోస్టుల‌ను నింపు జ‌ర అని వ్యాఖ్యానించిన ఆమె.. అలా చేస్తే.. నిరుద్యోగుల చావుల‌ను కొంత‌మేర‌కైనా ఆప‌వ‌చ్చు అని స‌ల‌హాఇచ్చారు.. కాగా, తెలంగాణలో వెంటనే 1.91లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ  వైఎస్ ష‌ర్మిల ఉద్యోగ దీక్షకు చేసిన సంగ‌తి తెలిసిందే.. ఇక‌, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆది నుంచి డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు ష‌ర్మిల‌. చూడాలి మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts