telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ పని చచ్చినా చేయను… కానీ చేయాల్సి వచ్చింది : షారుఖ్

Sharukh

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నేడు 54వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపేందుకు షారూఖ్ అభిమానులు ముంబైలోని మ‌న్మ‌త్ రెసిడన్స్ ద‌గ్గ‌ర అర్ధ‌రాత్రి నుండి ప‌డిగాపులు కాసారు. ఈ విష‌యం తెలుసుకున్న షారూఖ్ బ‌య‌ట‌కి వ‌చ్చి అభిమానుల‌కి అభివంద‌నం చేశారు. ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ప్ర‌ముఖ సినీ సెల‌బ్రిటీలు కూడా షారూఖ్‌కి సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. జీరో సినిమా త‌ర్వాత మ‌రో సినిమాకి క‌మిట్ కాని షారూఖ్ బ్ర‌హ్మాస్త్రాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా షారుక్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ షాకింగ్, ఫన్నీగా ఇన్సిడెంట్‌ను అభిమానులతో పంచుకున్నారు. “ఓసారి నేను కారులో ఓ ప్రదేశానికి వెళుతున్నాను. ఆ ప్రదేశం ఏంటో నేను చెప్పను. ఎందుకంటే అక్కడ నేను ఓ ఖరీదైన దొంగతనం చేశాను. అన్ని వివరాలు బయటపెడితే నన్ను పట్టుకుంటారు. కారులో వెళుతున్నప్పుడు కారు టైర్ పంక్చరైంది. దాంతో ఏం చేయాలో తెలీలేదు. దగ్గర్లో ఓ కారు పార్క్ చేసి ఉంది. అది కూడా నాలాంటి కారే. ఎవ్వరూ లేరు కదా అని టైరు దొంగిలించాను. ఆ టైరుని కారుకి పెడుతుంటే రెండో టైర్‌ కూడా పంక్చరై ఉంది. ఇక చేసేదేంలేక అదే కారు నుంచి మరో టైర్‌ను దొంగిలించాను. నా కారుకు టైర్లు ఫిక్స్ చేసి పంక్చరైన నా టైర్లను ఆ కారుకి పెట్టేశాను. దాంతో చూసేవారికి కారు టైరు పంక్చర్ అవ్వడం వల్ల వదిలేసి వెళ్లిపోయారు అనుకుంటారని అనుకున్నాను. కానీ ఇలా చేయడం తప్పు అని తెలుసు. అందుకే ఓ పేపర్‌లో నా పరిస్థితిని వివరించి సారీ అని రాశాను. ఆ పేపర్‌ను కారులో పెట్టాను. ఇలాంటి పనులు నేను చచ్చినా చేయను. కానీ ఆ సమయంలో నాకు వేరే మార్గం కనపడలేదు. దాంతో మనసు చంపుకుని ఆ పాడు పని చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకెప్పుడూ అలాంటి తప్పులు చేయలేదు” అని వెల్లడించారు షారుక్.

Related posts