తాజాగా తెలంగాణలో జీహెచ్ఎంసి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 4వ తేదీన ఈ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. అయితే, ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో మరొక పార్టీతో పొత్తు లేదా ఎక్స్ అఫిషియో ఓట్లతో మేయర్ పదవిని చేపట్టాల్సి ఉన్నది. మేయర్ ఎంపికకు ఫిబ్రవరి వరకు సమయం ఉన్నది. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేటర్ల సహా ఎక్స్ అఫిషియో సభ్యులు చేతులు ఎత్తే విధానం ద్వారా మేయర్ ఎంపిక జరుగుతుందని ఎస్ఈసి పేర్కొన్నది. మేయర్ ఎన్నికకు సంబంధించి పార్టీలు జారీ చేసే విప్ వర్తిస్తుందని, విప్ ను ఉల్లంఘించిన వారి ఓటు కూడా చెల్లుబాటు అవుతుందని ఎస్ఈసి పేర్కొన్నది. సభ్యుల ప్రమాణస్వీకారం చేసిన తరువాత అదే రోజున మేయర్ ఎన్నిక ఉంటుంది. ఆ తరువాత రోజు డిప్యూటీ మేయర్ ఎంపిక ఉంటుంది. ఇక మేయర్ పదవి కోసం ఒక్కరే పోటీ చేస్తే ఓటింగ్ పద్దతి లేకుండానే ఏకగ్రీవంగా ఎంపిక ఉంటుందని, ఇద్దరు పోటీ చేస్తే ఓటింగ్ పద్దతి ఉంటుందని, ఇద్దరికి సమానంగా వస్తే లాటరీ పద్దతి ద్వారా మేయర్ ను ఎంపిక చేస్తామని అన్నారు. సర్వసభ్య సమావేశానికి సగం మంది సభ్యుల కోరం తప్పనిసరి అని అన్నారు. మరి ఈ నిర్ణయం పై పార్టీలు ఏం విధంగా స్పందిస్తాయి అనేది చూడాలి.
previous post
next post

