టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న సమంత – నాగచైతన్య గత ఏడాది అనుహ్యంగా అక్టోబర్ 2న విడిపోతున్నట్లు సోషల్‌మీడియావేదికగా ప్రకటించారు. తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించబోమని వెల్లడిస్తూ అభిమానులకు షాకిచ్చారు. ఈ విషయం సినీ అభిమానులందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఆ తరువాత బాధ నుంచి తేరుకునేందుకు నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకుల విషయాన్ని మరిచిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీబిజీగా గడేపేస్తున్నారు.
అప్పుడప్పుడు సమంత స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లి వస్తుంది. ఇటీవల బంగార్రాజు మూవీ విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా నాగ చైతన్య సైతం తామిద్దరం విడిపోయినా.. ఎవరికి వాళ్లు సంతోషంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల ప్రకటన పోస్టును తొలగించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సామ్ ఎందుకు దాన్ని డిలీట్ చేసింది? తిరిగి కలిసేందుకు ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారా..లేక, మరేదైనా కారణంతో ఆ పోస్టు డిలేట్ చేసారా అనేది తెలియాల్సి ఉంది..
2017లో పెళ్లి చేసుకున్న చైతూ-సామ్.. 2020 అక్టోబరు 2న తమ బంధానికి ముగింపు పలికారు.