ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత..ఇప్పటి వరకు వెనక్కి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఎంతమంది హీరోయిన్స్ అందాలు వెద జల్లినా.. ఆమె గ్లామర్ ముందు దిగదుడుపే…మొదటి నుంచే స్టార్ హీరోలతో చేస్తూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ సమంత.
ఇటీవల సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ ఓటీటీలో విదులై రికార్డు బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో ‘ది ఫ్యామిలీ మెన్’ సిరీస్ లో రాజి పాత్ర చేసినందుకు గాను బెస్ట్ హీరోయిన్ అవార్డు దక్కించుకోగా తాజాగా సైమాలోను దుమ్ముదులుపేసింది సామ్.
నందినిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ఓ బేబీ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డు లభించింది. హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ సైమా వేడుకలకి దక్షిణాది తారలు తరలివచ్చారు. కానీ.. హైద్రాబాద్‌లో జరుగుతున్న సైమా వేడుకలకు సమంత హాజరు కాలేకపోయింది. దీంతో సమంతకు బదులుగా ఆ అవార్డును నందినీ రెడ్డి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తానూ ఈవెంట్ కి రాకపోయినా సోషల్ మీడియాలో తనకి ఉత్తమ నటి అవార్డు రావటంపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యింది సమంత. ‘ఓ బేబీ మూవీ నా లైఫ్ లో ఒక ప్రత్యేకమైంది. ఈ మూవీకి అవార్డు ఇచ్చినందుకు సైమాకి కృతఙ్ఞతలు. ఇంత గొప్ప మూవీ నాతో చేసినందుకు నందిని రెడ్డి కి థాంక్స్. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో అది నీకు తెలుసు. నీతో మరో అద్భుత మూవీ చేయాలనీ ఉంది. సైమా విజేతలందరికి కంగ్రాట్స్’ అంటూ సమంత ఓ బేబీ, ఉత్తమ నటి అంటూ హ్యాష్ ట్యాగ్‌లను సమంత షేర్ చేసింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.