సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం “దబాంగ్-3”. సల్మాన్ ఖాన్, అర్బాజ్‌ఖాన్, నిఖిల్ ద్వివేది ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. తొలి రెండు పార్టుల్లో సల్మాన్ సరసన నటించిన సోనాక్షి సిన్హానే ఈ చిత్రంలోనూ సల్మాన్ భార్యగా నటించారు. అయితే సల్మాన్ ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రం ఓ లవ్‌స్టోరీ ఉన్నట్లు ట్రైలర్ చూపించారు. ఈ ట్రైలర్లో మహేశ్ మంజ్రేకర్ తనయ సయీ మంజ్రేకర్ ప్రేయసిగా నటించింది. తొలి రెండు భాగాల్లో సల్మాన్ తండ్రిగా నటించిన వినోద్ ఖన్నా కన్నుమూయడంతో ఆయన స్థానంలో ప్రమోద్ ఖన్నా నటించారు. డింపుల్ కపాడియా సల్మాన్ తల్లిగా నటించారు. దబంగ్‌లో సోనూసూద్, దబాంగ్-2లో ప్రకాశ్ రాజ్ విలన్స్‌గా నటించగా దబాంగ్-3లో కన్నడ స్టార కిచ్చా సుదీప్ విలన్‌గా నటించారు. ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఈ చిత్రంతో తొలిసారి సల్మాన్ దక్షిణాది ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నారు.

