telugu navyamedia
సినిమా వార్తలు

దీపికా స్టార్… అందుకే ఆమెకు జోడిగా నన్ను తీసుకోవడం లేదు : సల్మాన్ ఖాన్

Deepika-Padukone-and-Salman-Khan

కండల వీరుడు సల్మాన్ ఖాన్ చాలాకాలంగా బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ఆడిపాడారు సల్మాన్. ఆయన సరసన పలుమార్లు నటించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ జాబితాలో కత్రినా కైఫ్ ముందువరుసలో ఉంటుంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మాత్రం ఇప్పటి వరకూ సల్మాన్ తో కలిసి నటించకపోవడం ఆశ్చర్యకరం. ఇదే విషయాన్ని దీపికా వద్ద ప్రస్తావించగా… “మేమిద్దరం కలిసి ఇంతవరకూ నటించలేదంటే… భవిష్యత్తులో మా కోసం ప్రత్యేకమైన సినిమా ఏదో ఉండబోతోందని నా నమ్మకం” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయాన్ని సల్మాన్ వద్ద ప్రస్తావించగా “నాకంటే ఆమె పెద్ద స్టార్… నాతో నటించడానికి దీపికకు సమయం ఉండాలి కదా. అందుకే ఆమె జోడిగా నన్ను ఎవరూ తీసుకోవడం లేదేమో” అంటూ చమత్కరించడం గమనార్హం. తాను చేయబోయే మూడు సినిమాల్లో హీరోయిన్లను ఇప్పటికే ఎంపిక చేసేసుకున్నారని, ఆ తరువాత సినిమాలో దీపికను తీసుకునే అవకాశం ఉండొచ్చని తెలిపారు సల్మాన్.

Related posts