దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవరస్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్లో మూడో షెడ్యూల్ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జూలై 30న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. రెండు నిజ పాత్రల కల్పిత కథాంశమే ఈ చిత్రమని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కథ కావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. మరి ఈ వార్తలపై యూనిట్ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
							previous post
						
						
					
							next post
						
						
					

