ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడడంతో 10 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రమాద తీవ్రతను చూస్తే మృతులు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
కర్ణాటకలోని వై.ఎన్.హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనను తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నారని..వారిలో ఎక్కువమంది డిగ్రీ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
తాను ఏ విచారణకైనా సిద్ధం: చింతమనేని