వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఆర్జీవిపై సినిమా తీస్తామని కొందరు ప్రకటించిన విషయం తెలిసిన విషయమే. అయితే ఈయన గతకొద్ది రోజులుగా సైలెంట్‌గానే ఉంటున్నాడు. తాజాగా ‘‘RGV (ఒక సైకో బయోపిక్)’’ అనే టైటిల్‌తో సినిమా తీయడానికి తెలుగు ఫిలిం ఛాంబర్ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘‘RGV (ఒక సైకో బయోపిక్)’’ టైటిల్‌తో సినిమా తీయడానికి ఆ పేరు ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ పేరు కావడం చేత వీలు పడదని, టైటిల్ ఆమోదం పొందాలంటే రామ్ గోపాల్ వర్మ దగ్గరి నుండి NOC (No Objection Certificate) తీసుకోవాలని, దానిని ఛాంబర్ వారికి అందించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో వర్మ పేరుకున్న పవర్ ఏంటో తెలిసింది అంటున్నారు ఆయన అభిమానులు.
previous post