ఏపీలో గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి..ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల వివాదం కొనసాగుతుంది. టికెట్ ధరలు ప్రభుత్వం తగ్గించడం తో నిర్మాతలు , థియేటర్స్ యాజమాన్యం తో పాటు సినీ ప్రముఖులు సైతం అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ వారం రోజులుగా ఏపీ మంత్రి పేర్నినాని, రాంగోపాల్ వర్మల మధ్య వాడీవేడీగా ట్విట్టర్ వార్ కొనసాగిస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే.. పేర్నినానిని కలిసేందుకు ఆర్జీవీ అనుమతి కోరారు. మంత్రి అనుమతిస్తే తమ సమస్యలు వివరిస్తానని చెప్పారు. జగన్ ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తోందని ఆశిస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు ఆర్జీవీ. ప్రభుత్వంతో గొడవకు దిగాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని కూడా ట్విటర్ వేదికగానే స్పందించారు. “ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా త్వరలో కలుద్దాం” అంటూ.. రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని జనవరి 10న అపాయింట్మెంట్ ఇచ్చారు.
దీనిపై స్పందించిన వర్మ.. “నన్ను ఆహ్వానించినందుకు మంత్రి పేర్నినానికి ధన్యవాదాలు.. భేటీలో సినిమా టికెట్ ధరలపైనా నా అభిప్రాయాలు పంచుకుంటా, చలనచిత్రాలు, థీమ్ పార్కులు వినోద సంస్థలు, సంగీత కచేరీలు, మ్యాజిక్ షోలు కూడా వినోద సంస్థల కిందకు వస్తాయి. వాటి టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించలేదు.” అంటూ ఆర్జీవీ మరో ట్వీట్.
For ur kind info like films, theme parks , music concerts , magic shows etc etc also come under entertainment enterprises ..Their ticket prices also are not fixed by the government
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2022