ఏపీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దుర్గగుడి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం లేచింది. దుర్గగుడి ఆలయ ప్రాంగణంలోని ఈవో ఛాంబర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలన సరిగాలేదని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవస్థానం అధికారులు నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకొచ్చారు.
ఈవో కోటేశ్వరమ్మ దుర్గగుడి ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి వచ్చే ప్రముఖలు ఇక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయకూడదన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు, వ్యక్తిగత, వ్యాపారానికి సంబంధించి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ఆంక్షలు విధించారు.


పట్టు పెంచుకోవాలేతప్ప.. శత్రుత్వం పెంచుకోకూడదు: ఉండవల్లి