telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

హిందూపురం పోలింగ్ డేటా విడుదల

ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేడు హిందపూరం పార్లమెంటరీ స్థానం పోల్ డేటాను విడుదల చేసింది.

హిందూపురం లోక్ సభ నియోజకవర్గం మొత్తమ్మీద 84.70 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించింది.

హిందూపూరం ఎంపీ స్థానం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,56,775 కాగా… 14,03,259 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపింది.

వారిలో పురుష ఓటర్ల శాతం 85.46, మహిళా ఓటర్ల శాతం 83.94, ట్రాన్స్ జెండర్ ఓటర్ల శాతం 47.36 అని సీఈవో కార్యాలయం వివరించింది.

అత్యధికంగా ధర్మవరం అసెంబ్లీ స్థానంలో 88.83 శాతం పోలింగ్ నమోదు కాగా…

అత్యల్పంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 77.82 శాతం ఓటింగ్ నమోదైంది.

మడకశిర అసెంబ్లీ నియోజకవర్గంలో 87.45,

పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 86.96,

పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 86.27,

రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో 85.09,

కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 81.37

శాతం పోలింగ్ నమోదైనట్టు సీఈవో కార్యాలయం పేర్కొంది

Related posts