telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

కరోనా రోగిని రోడ్డుపై వదిలి వెళ్లిన 108 సిబ్బంది!

Corona

కరోనా పేషెంట్ పై కనికరం చూపకుండా 108 సిబ్బంది నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. ఈ ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది. కరోనా రోగులను ప్రేమతో చూడాలని సీఎం జగన్ పదేపదే చెపుతున్నా సిబ్బందికి చెవికెక్కడం లేదు. మడకశిర మండలం గుండుమల పంచాయతీ పీఎస్ తాండాకు చెందిన గోపినాయక్ అనే 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో వైద్యం అందిస్తున్నప్పటికీ నయం కాకపోవడంతో… నిన్న అర్ధరాత్రి 108 సిబ్బంది అతడిని అంబులెన్సులో తీసుకెళ్లి రోడ్డుపై వదిలేశారు. అచేతన స్థితిలో ఉన్న గోపినాయక్ ను చూసి స్థానికులు చలించిపోయారు. అతని వద్ద నుంచి వివరాలు తీసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు వచ్చి ఆయనను స్వగ్రామానికి తీసుకెళ్లారు.

Related posts