telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 15 (ఆదివారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. గృహ అవసరాలకు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత బకాయిలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రశాంతత. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు అనుకూలం ఇంజినీరింగ్, పరిశోధక విద్యార్థులకు బాగుంది.

వృషభం: రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది.

మిథునం: చాలావరకు మిశ్రమంగా కొనసాగుతోంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. వ్యాపారులు శ్రద్ధ పెట్టాలి.

కర్కాటకం: ఆశించిన స్థాయిలో ఆదాయం ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. కోర్టు కేసులో శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.

సింహం: ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తి చేస్తారు. కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వివాహ సంబంధాలకు అనుకూలం. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులకు బాగుంటుంది. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి అనుకూలం. డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి.

కన్య: అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు, సాహిత్య రంగాలకు చెందినవారికి బాగుంది. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు.

తుల: అవసరానికి కావాల్సిన డబ్బు అందుతుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనుకూలం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

వృశ్చికం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. వివాహ సంబంధాల విషయంలో అనుకూలం. వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులు వాయిదా పడే అవకాశం.

ధనస్సు: ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. అధికారులు ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ, వాహన యోగం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

మకరం: ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చి పెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. కష్టంమీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు శ్రమపడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు తెచ్చి పెడతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.

కుంభం: కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. మితిమీరిన ఔదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలం. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మీనం: చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధాలకు అనుకూల సమయం. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు. ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశం. కోర్టు కేసుల్లో అనుకూలత ఉంటుంది.

Related posts