టాలీవుడ్ మోస్ట్‌వాంటెడ్ హీరోయిన్ రష్మికా మందన్న. ఈ మధ్యనే తమిళంలో కార్తీ హీరోగా చేస్తున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ కన్నడ భామ. అయితే విజయ్ తర్వాతి సినిమాకి రష్మిక ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. అయితే అవన్నీ ఒట్టిపుకార్లేనని, తనకీ విజయ్‌తో కలిసి నటించాలని ఉంది కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎవరు తనను సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు పుకార్లు నిజమై ఆ అవకాశం వస్తే తనకంటే సంతోషించేవారు ఇంకెవరు ఉండరని కూడా అంటోందీ భామ. దీంతో ఇలయదళపతితో నటించి శాండల్‌వుడ్, టాలీవుడ్‌నే కాదు కోలీవుడ్‌ని కూడా ఏలేయాలనుకుంటుందని అర్థమవుతోంది. ఇక టాలీవుడ్ తాజాగా మహేష్ 26వ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

