telugu navyamedia
సినిమా వార్తలు

రూల్స్‌ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు సర్‌..

టాలీవుడ్‌ స్టార్‌ హీరో గోపీ చంద్‌ హీరో గా సంపత్‌ నంది దర్శకత్వంలో సీటీమార్‌ మూవీ రూపొందింది. ఇందులో గోపిచంద్‌ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ విషయానికి వస్తే… మాస్‌ లుక్‌ లో హీరో గోపీ చంద్‌ అదరగొట్టాడు.

Seetimaar: Gopichand, Tamannaah Bhatia starrer gets a release date; Details Inside | PINKVILLA

కబడ్డీ నేపథ్యంలో సాగే కథ ఇది. ‘ఒక ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయర్సా? మీకు రూల్స్‌ తెలుసు కదా’ అనే సంభాషణతో ప్రారంభమవుతుందీ ట్రైలర్‌. ‘రూల్స్‌ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు సర్‌. రూట్ లెవల్‌ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్‌లో వస్తారు’ ‘మన దేశంలో మగాళ్లు కనీసం అరవయ్యేళ్లు బతికి చచ్చిపోతున్నారు, ఆడాళ్లు కూడా అరవయ్యేళ్లు బతుకుతున్నారు.. కానీ 20 ఏళ్లకే చచ్చిపోతున్నారు..’  అని గోపీచంద్‌ ఇచ్చిన సమాధానం అలరిస్తుంది.

Jwala Reddy' from Seetimaarr: Tamannaah steals the show in the foot-tapping number | Telugu Movie News - Times of India

పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో, యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘ఒక్కసారి కోర్టులో అడుగుపెట్టాక మీ ఫోకస్‌ ఉండాల్సింది కూత, గీత మీదే.. ఈ బ్యాచ్‌ అయిపోయేలోపు మ్యాచ్‌ అయిపోవాలి ’ అంటూ కోచ్‌గా గోపీచంద్‌  చెప్పే డైలాగ్‌ జనాలకు కనెక్ట్‌ అవుతుంది.   గోపీచంద్‌, తమన్నా, రావు రమేశ్‌ నటన మెప్పిస్తోంది.

ఈ సినిమాలో గోపీచంద్‌, తమన్నా ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. దిగంగనా సూర్యవంశీ, భూమిక కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం హైలెట్‌ కానుంది. ‘గౌతమ్‌నంద’ తర్వాత సంపత్‌నంది- గోపీచంద్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాకావడంతో ‘సీటీమార్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదల కానుంది.

Seetimaarr Official Trailer Out Now - Sakshi

Related posts