రెండ్రోజుల్లో ఎన్నికలు… ఈ నేపథ్యంలో ఎన్నికల గురించి ఎలాంటి వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా బుల్లితెర యాంకర్ రష్మీ తనతో పాటు తన తల్లికి ఇంకా ఓటర్ స్లిప్పులు అందలేదని తెలిపింది. తనకు వైజాగ్ లో ఓటర్ ఐడీ ఉందనీ, అక్కడే శాశ్వత నివాసం కూడా ఉందని, తమతో పాటు మొత్తం బిల్డింగ్ లో ఎవ్వరికీ ఓటర్ స్లిప్పులు అందని విషయం నిన్న సాయంత్రం వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. దీంతో ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తామని రష్మీ చెప్పింది. ఓటర్ స్లిప్పుల కోసం తాను ఈరోజు సాయంత్రం వరకూ వేచి చూస్తానని స్పష్టం చేస్తూ ఈ మేరకు రష్మీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.
							previous post
						
						
					
							next post
						
						
					

