మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. రొమాంటిక్ డ్రామా ‘ఉప్పెన’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందాడు వైష్ణవ్ తేజ్.
రెండో ప్రయత్నంలో.. క్రిష్ దర్శకత్వంలో కొండపొలం మూవీ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేకపోయింది.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ గిరీశయ్య దర్శకత్వంలో ‘రంగరంగ వైభవంగాస రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన రొమాంటిక్ టీజర్, పోస్టర్స్ ఆడియెన్స్ ను అలరించాయి
తాజాగా మూవీ రిలీజ్ పై అప్డేట్ అందించారు మేకర్స్. జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు ఈ మేరకు నాయికానాయికల స్టిల్‌ను విడుదల చేసింది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి భారీ స్థాయిలో మూవీని రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రసాద్ తెలిపారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

