telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శరవేగంగా “నారప్ప” షూటింగ్

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌ గా రూపొందుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేస‌విలో విడుద‌ల చేయాల‌నుకుంటే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. వెంకటేష్ అభిమానులు ‘నారప్ప’ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ మూవీ తాజా షెడ్యూల్‌ వికారాబాద్‌ అడవుల్లో ప్రారంభమైంది. 15 రోజులు పాటు నాన్‌ స్టాప్‌గా ఈ షెడ్యూల్‌ కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌లో వెంకటేష్‌తో పలు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివరి కల్లా సినిమా చిత్రీకరణ పూర్తి కానుండగా… వచ్చే ఏడాది మార్చి లో ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

Related posts