telugu navyamedia
సినిమా వార్తలు

‘బంగార్రాజు’ అదిరిన రమ్యకృష్ణ లుక్‌

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జంటగా నటిస్తున్నారు.నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సినిమా నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నాగార్జున, రమ్యకృష్ణ ‘సత్యభామ’ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాగార్జున, రమ్యకృష్ణ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. లుక్ అదిరిపోయింది.

ప్రస్తుతం “బంగార్రాజు” షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేస్తూ నాగ చైతన్య కూడా తన తండ్రితో కలిసి కన్పించబోతున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ అంతటా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

 అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మూవీ ‘బంగార్రాజు’(Bangarraju). సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించి చాలా రోజులే అవుతోంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మరోసారి నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ బుధవారం రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సత్యభామగా ఆమె లుక్‌ను విడుదల చేసారు. (Twitter/Photo)

Related posts