సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో వైసీపీ పార్టీ రావడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. తను రూపొందించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను ఎట్టకేలకు ఏపీలో విడుదల చేయగలిగాడు. వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే వర్మ త్వరలోనే “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు టైటిల్ పై పాజిటివ్ కామెంట్స్, చేస్తే మిగతా సామాజికవర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో మరోసారి కులాలను ఉద్దేశిస్తూ వర్మ చేసిన మరో పోస్ట్ సంచలనంగా మారింది. “ఎండలకి భయపడి కాదు.. రెడ్లకు భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట” అని ట్వీట్ చేశాడు. చంద్రబాబు ఓటమి తరువాత ఆ సామాజిక వర్గానికి చెందినవారు అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు వర్మ చేస్తున్న ట్వీట్లు వారిని మరింతగా అసహనానికి గురి చేస్తున్నాయి.


బాలయ్య వ్యాఖ్యలతో చిరు షాకింగ్ డెసిషన్…?