వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎదో ఒక వార్తల్లో నిలుస్తుంటాడు..ఏం చేసినా సెన్సేషన్ అవ్వాల్సిందే. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయటపెడుతుంటారు.
ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వర్మ చేసే కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వర్మ టీవీ షోలలో, ఇంటర్వ్యూలలో అక్కడున్న అమ్మాయిలను తెగ పొగిడేస్తుంటాడు. తాజాగా యాంకర్ శ్యామలపై పొగడ్తలతో ముంచెత్తాడు.
తాజాగా కన్నడ హీరో ధనంజయ నటించిన చిత్రం బడవ రాస్కెల్. ఇటీవల పుష్ప సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధనంజయ ఈ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయం కానున్నాడు. ఇక ఈ చిత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వెళ్లారు..వేదికపైకి వచ్చిన వెంటనే మైక్ పట్టుకున్న ఆర్జీవీ.. తానొక రాస్కెల్ ని అని చెప్పుకున్నారు.
ఆ వేడుకకు హోస్టింగ్ చేస్తున్న యాంకర్ శ్యామలను చూసి ..ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. దీంతో ఆర్జీవి నోటివెంట ఆ మాటలు విన్న శ్యామల సిగ్గు పడుతూ మెలికలు తిరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతేకాకుడా.. తనను తోపు, రౌడీ, గుండా ఇలా అన్ని పేర్లతో పిలిచారని.. కానీ తాను రాస్కెల్ కూడా అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. బడవ రాస్కెల్ సినిమా ఈనెల 18న విడుదల కానుంది.