సమాజంలో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న వారిద్దరూ హద్దు మీరి అసభ్యంగా ప్రవర్తించారు. అతనో పోలీస్ అధికారి..ఎంతో మంది పోలీసులకు స్పూర్తిగా ఉండాల్సిన పోలీసు అధికారులే ఇలాంటి ఆసభ్య కార్యక్రమాలు చేస్తుంటే సమాజంలో విమర్శలకు గురవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఓ రిసార్టులో ఓ పోలీసు బృందం అకస్మాత్తుగా దాడి చేసింది. భర్తతో విడిపోయిన ఓ మహిళా కానిస్టేబుల్, రాజస్థాన్ పోలీస్ సర్వీస్ (RPS) అధికారి.. లకు సంబంధించిన అభ్యంతరకర వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళా కానిస్టేబుల్, డీఎస్పీలు స్విమ్మింగ్‌పూల్‌లో అభ్యంతరకర స్థితిలో ఆ వీడియోలో కనిపిస్తున్నారు. అదే స్విమ్మింగ్ పూల్ వీరితో పాటు మహిళ ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

ఆ చిన్నారి సమక్షంలోనే హీరాలాల్ సైనీ, మహిళా కానిస్టేబుల్ అర్థనగ్నంగా అసభ్యకర రీతిలో ప్రవర్తించారు. ఈ వీడియోని చూసిన రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులు వీరిపై యాక్షన్ తీసుకున్నారు. వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ అరెస్ట్‌ను ఏడీజీ అశోక్ రాథోడ్ ధ్రువీకరించారు.కాగా ఆ మహిళా కానిస్టేబుల్ జైపూర్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సదరు డీఎస్పీ అజ్మేర్ జిల్లాలో పనిచేస్తున్నారు.


