రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన ‘అర్జున’ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు మార్చి 6న కాకుండా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి ప్రకటించారు. కరోనా ప్రభావం కారణంగానే చిత్రం విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన మరియం జకారియా హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు.నట్టిస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ అద్భుతమైన నటనను కనబరిచారని నిర్మాతలు చెప్పారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి వెల్లడించారు.

