ప్రముఖ తమిళ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. బెడ్‌పై పడుకుని పక్కన ఓ టెలిఫోన్ పెట్టుకుని అదిరిపోయే స్టిల్ దిగింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. ఇందుకు కారణం రైజా ఆ ఫొటోకు ఇచ్చిన క్యాప్షనే. ‘నా ల్యాండ్‌లైన్‌కు కాల్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక నెటిజన్స్ ఊరుకుంటారా? నెంబర్ ఇవ్వకుండా ఎలా కాల్ చేయమంటారా? నెంబర్ ఇవ్వండి అంటూ వరుసగా కామెంట్లు పెట్టారు. ఈ ఫొటోకు దాదాపు ఐదు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 2017లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన రైజా విల్సన్ ‘వీఐపీ 2’ సినిమాలో కాజోల్ పక్కన అసిస్టెంట్‌గా చిన్న పాత్రలో కనిపించారు. అయితే ఈ పాత్రకు ఆమెకు క్రెడిట్ దక్కలేదు. ఆ తర్వాత ‘ప్యార్ ప్రేమా కాదల్’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో ఆమె హరీష్ కళ్యాణ్‌కు జోడీగా నటించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత రైజాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
previous post

