నటిగా మంచి పేరు సంపాదించుకున్న కన్నడ భామ రాధికా కుమారస్వామి. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అక్కడ హీరో శ్రీకాంత్ సరసన ‘మీసై మాధవన్’, ‘సొల్లట్టుమా’ లాంటి సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రహస్య వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి భర్తతోనే బిజీగా ఉండిపోయింది. సినిమాలకు కూడా దూరమైపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కోడి రామకృష్ణ తెరకెక్కించిన “అవతారం” సినిమాలో నటించింది రాధిక. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రాధిక.. దక్షిణాదిన అన్ని భాషల్లో నటిస్తుంది. తాజాగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లో విడుదల కానున్న ‘దమయంతి’లో నటిస్తుంది. అరుంధతి, భాగమతి తరహాలో సాగే హారర్ థ్రిల్లర్ ఇది. నవరసన్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో ఈ సినిమాను ‘సంహారిణి’ పేరుతో విడుదల చేయనున్నారు. మొత్తానికి ఈ సినిమాతో మాజీ ముఖ్యమంత్రి భార్య ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
							previous post
						
						
					

