అమ్మ పిలుపే శ్రీకారం..!!
నాన్న పలుకే శుభకరం..!!
గురు విద్యయే ఓంకారం..!!
అక్షరాలతో సేద్యం మమకారం..!!
అక్షరాలతో ఆటలు అలంకారం..!!
పాట పాటతో జాగృతం..!!
పల్లవించేను గళాన గానామృతం..!!
విజయానికి అక్షరమే శంఖారావం..!!
మ్రోగించుదాం విజయఢంకా నాదం..!!
అక్షరానికి కలం ఆయుధం..!!
కలానికి బలం అక్షరం..
అక్షరాలతో అడుగులు వేద్దాం..!!
ముందు తరాలకు కొత్త బాటలు వేద్దాం..!!
తర తరాలు మారినా మారిపోని అక్షరాలను
అభిషేకిద్దాం..!!
ఖ్యాతిగాంచిన కవులను పూజిద్దాం..!!
అక్షరాల అమృతాన్ని అందరికీ పంచుదాం..!!
అడుగు అడుగులో అక్షరంలోనున్న గొప్పతనాన్ని చూపిద్దాం..!!
వేద్దాం వేద్దాం అక్షరంతోనే అడుగులు వేద్దాం..!!
అక్రమ నిర్మాణంలోనే చంద్రబాబు నివాసం: రామకృష్ణారెడ్డి