కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి వజ్యోత్ సింగ్ సిద్దూ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత సోమవారం సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్దూ రాజీనామాను పంజాబ్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ ప్రకటన విడుదల చేసింది. సిద్దూ రాజీనామాకు అమరీందర్‌సింగ్ ఆమోదం తెలుపుతూ గవర్నర్ వీపీ సింగ్‌కు పంపారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం అమరీందర్‌సింగ్, సిద్ధూ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. జూన్ 6న మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేపట్టి సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖల్లో ముఖ్యమైన స్థానిక సంస్థలు, పర్యాటక, సాంస్కృతిక శాఖను తొలగించి విద్యుత్తు, నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల శాఖలను అప్పగించారు. సిద్దుతన మంత్రిత్వశాఖను పూర్తిస్థాయిలో సమర్థంగా నిర్వహించలేకపోయారని ఫలితాల అనంతరం అమరీందర్ ఆరోపించారు. కొత్త శాఖ పై సిద్దు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా సమర్పించారు.