telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు వార్తలు

ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు: కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఏపీలో గత కొన్ని రోజులుగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వైసీపీ  నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు.

ఈ క్రమంలో ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన ఓ వైసీపీ నాయకుడికి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌పై ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

ఈనెల 13న వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా రప్ప రప్ప అంటూ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌ ఆవేశ ప్రసంగాలు చేశారని అక్కడి టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కంచికచర్లలో వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌ కూటమి ప్రభుత్వాన్ని  టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

కూటమి ప్రభుత్వంలో పాలకులు అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని రెడ్‌బుక్‌  రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పుడు అధికారంలో మీరు ఉన్న.. రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామని, కూటమి నాయకులు, అధికారులను.. తమ కార్యకర్తల ఇంటివద్దకే తీసుకెళ్లి రప్పా.. రప్పా  చేస్తానని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా వరుసగా వైసీపీ నాయకులు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చేడు సంస్కృతిని ప్రేరేపిస్తున్నట్లు ఉన్నాయి.

Related posts