తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒంటి కాలిపై నిలబడి శనివారం నిరసన వ్యక్తం చేశారు. అలాగే తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని సూచించే ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓయూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ కన్వీనర్ డాక్టర్ డి ధర్మతేజ మాట్లాడుతూ గత రెండు మాసాలుగా వివిధ రూపాల్లో తాము ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా వెంటనే తమ రెగ్యులర్రైజేషన్ పై ప్రకటన చేసి తగిన ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా తరగతులను బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వివిధ కళాశాలలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అయోధ్య కవితా రెడ్డి, డాక్టర్ వినీత పాండే, డాక్టర్ దీకొండ తిరుపతి, డాక్టర్ విజయ్, డాక్టర్ మోడెం రవి, డాక్టర్ శంషుద్దీన్, డాక్టర్ ఆరూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్: ఓయూలో ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు


ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని