భారతీయులందరిని హింస నుండి శాంతి వైపు నడిపించి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని భారతీయులందరూ ఆయనను స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలకు హాజరైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గాంధీజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ 150వ జయంతి సందర్భంగా 150 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు మోడీ. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం విశ్వరూపానని తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ… యావత్ ప్రపంచం గాంధీ జయంతిని జరుపుకుంటున్నారని… గాంధీ జయంతి స్మారకంగా ఐక్యరాజ్యసమితి పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.
ఇప్పుడు స్మారక నాణాలను స్టాంపులను కూడా విడుదల చేస్తున్నామని ప్రధాని తెలిపారు. అయితే అంతకు ముందు గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మోడీ… గాంధీజీకి ఘన నివాళి అర్పించి ఆశ్రమంలో గాంధీ వాడిన వస్తువులు ఆయన నడయాడిన నేలను సందర్శించి దేశానికి మహాత్ముడు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా సబర్మతి ఆశ్రమం సందర్శకుల పుస్తకంలో భారత్ మొత్తం బహిరంగ మలవిసర్జన రహితంగా మారిందని… ఇలాంటి సమయంలో సబర్మతి ఆశ్రమంలో జాతిపిత జయంతి వేడుకలకు హాజరై నివాళులు అర్పించటం తన అదృష్టంగా భావిస్తున్నా అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సందేశాన్ని విజిటర్స్ బుక్ లో రాశారు.


టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు