ప్రధాని నరేంద్ర మోదీ ఇంటికి పోయే సమయం ఆసన్నమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ నినాదం మార్మోగుతోందన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక పాలనను దేశ ప్రజలు భరించేందుకు సిద్ధంగా లేరని అన్నారు.
రైతులు, మహిళలు, యువత బీజేపీ, వైసీపీకి దూరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, దాని కీలుబొమ్మ పార్టీలకు ఓటమి తప్పదని అన్నారు. ఐదేళ్లలో చేసింది గొప్ప చరిత్ర అని..రాబోయే రోజుల్లో చేసేది మరో చరిత్ర అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబు చెప్పారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన పనులను గురించి ప్రజలకు చెప్పాలని సూచించారు.
చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ: శివరాజ్‌సింగ్