పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. పవన్ ఇటీవల వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణను ముగించుకున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్త లుక్స్‌లో కనిపించనున్నారంట. అందుకోసం పవన్ తన కెరీర్‌లో చాలా గ్యాప్ తరువాత మళ్లీ జిమ్‌లో కసరత్తులు చేసేందుకు సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ లోకి పవన్ ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో పవన్ పీరియాడికల్ లుక్ లో కనిపిస్తుండగా.. ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కొత్తగా ఈ సినిమాకు కేవలం వీరమల్లు అనే టైటిల్‌ను పరివీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మహాశివరాతి సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్‌డేట్ ఇవ్వనున్నారంట. అందులో సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
previous post