telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” మళ్ళీ వాయిదా ?

RRR

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంబించిపోయింది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకీ పాజిటివ్ మరియు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీయ నిర్భందంలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది జూలై 30న విడుదలయ్యేది… కానీ ఇప్పుడు అనుకోని ఉపద్రవంగా కరోనా వచ్చిపడడంతో `ఆర్ఆర్ఆర్` విడుదల జనవరిలో కూడా ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో యూరప్‌కు చెందిన ముగ్గురు నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పట్లో కుదిరే పని కాదు. కాబట్టి వీరు షూటింగ్‌కు హాజరవడం కష్టం. ఇక, ఈ సినిమాకు పనిచేసే గ్రాఫిక్స్ కంపెనీలు కూడా మూతబడ్డాయి. అమెరికా, యూరప్‌ల్లోని కంపెనీలకే మేజర్ గ్రాఫిక్స్ వర్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పట్లో అవి వర్క్ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటి దృష్ట్యా `ఆర్ఆర్ఆర్` విడుదల సంక్రాంతికి సాధ్యపడదని అంటున్నారు. వచ్చే ఏడాది వేసవికే విడుదల కావొచ్చని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Related posts