వకీల్ సాబ్ సినిమా గురించి మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పరిశీలకులు సినిమాల కోసం ఆరాటపడుతున్నారన్న ఆయన సునీల్ దేవధర్ సినిమా టికెట్ గురించి గొడవ చేశారని, అయితే రాష్ట్రంలో నాలుగు షోలకే అనుమతులన్నాయని అన్నారు. వకీల్ సాబ్ హిట్ కి, బీజేపీ గెలుపునకు సంబంధం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. పువ్వు గుర్తుకు ఓటెయ్యండి అని వచ్చారా? చెవిలో పువ్వులు పెట్టేందుకు వచ్చారా? అని ఆయ ప్రశ్నించారు. 2019 ఎన్నికల ముందు వకీల్ సాబ్ బీజేపీ గురించి మాట్లాడినవి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికలో కమలానికి ఎందుకు ఓటేయాలో ప్రజలకు చెప్పండి, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం హామీలు తీర్చినందుకు ఓటెయ్యాలా? ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పినందుకు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. బీజేపీ పవన్ కి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని, హిందీ, తమిళ్ లో తీసేసిన పాచిపోయిన సినిమా వకీల్ సాబ్ అని ఆయన అన్నారు. దాన్నే పవన్ బీజేపీకి చూపిస్తున్నారని అన్నారు.
next post


ఓట్ల కోసమే ఈబీసీ రిజర్వేషన్ బిల్లు: టీడీపీ ఎంపీ సీతారామలక్ష్మి