అన్నయ్య.. నా దృష్టిలో ఆపద్బాంధవుడు ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేశారు.
అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు రూ.5 కోట్లు విరాళమిచ్చారు.
విజయం అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా ఆశీర్వదించారు, అన్న ఇచ్చిన నైతిక బలం, మద్దతు అఖండ విజయాన్ని చేకూర్చాయి.
తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్