telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్.

వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి రామానాయిడు. శంకర గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే  దేవ వరప్రసాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు.

కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం.

రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Related posts